మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం telugu పండుగలు   తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి వైభవం


త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారం కోసం ఆవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం- నృసింహస్వామి. ప్రహ్లాదుడి విన్నపం మేరకు సద్యోజాతంగా అంటే వెంటనే ఆవిష్కారమైన అవతార పరంపరలో నరసింహావతారం విశేషమైనది. మృగమూ కాకుండా, మనిషీ కాకుండా నరజంతు సమ్మిళిత రూపంలో స్వామి సాకారమయ్యాడు. హిరణ్య కశిపుడు పొందిన వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పరమాత్మ తన మూర్తిమత్వాన్ని ప్రకటించి అతణ్ని వధించాడు. హిరణ్యమంటే బంగారం. కశిపమంటే భోగలాలసత్వాన్ని పెంచే గుణం. లౌకిక పరమైన సౌఖ్యాలు, సంపదలు, అనంతమైన కోరికల విషవలయంలో చిక్కుకుని, హృదయంలో వెలిగే పరంజ్యోతిని హిరణ్య కశిపుడు దర్శించలేకపోయాడు. తన వాడి గోళ్లతో, అసురుడి హృదయాన్ని పెరికి అందులో వెలిగే జ్ఞానజ్యాతిని దర్శింపజేసి, హిరణ్య కశిపుడికి నృసింహుడు ముక్తిని ప్రసాదించాడు. చీకటి-వెలుతురు, మంచి-చెడు, రాత్రి-పగలు, మానవత్వం-దానవత్వం, నిద్ర-మెలకువ... ఇలా ద్వంద్వాత్మక ప్రవృత్తితో జగత్తు కొనసాగుతుంది. ఆ రెండు అంశాల సంధిలో అవగతమయ్యే తత్త్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ద్వంద్వాత్మక స్థితులకు అతీతంగా మసలుకుని, ఏకోన్ముఖంగా చైతన్య పూరితంగా వ్యవహరించాలి. నృసింహావతారం అందించిన సందేశమిదే!

హిరణ్యకశిపుడి వధ తరవాత తన ఉగ్రరూ పాన్ని ఉపసంహరించి, ప్రహ్లాదుడికి ప్రేమాస్పద మూర్తిగా స్వామి దర్శనాన్ని అనుగ్రహించాడంటారు. అలా నరహరి ప్రసన్నకారకమూర్తిగా తేజరిల్లిన క్షేత్రమే- యాదాద్రి. పంచనారసింహ క్షేత్రంగా వర్ధిల్లుతున్న యాదాద్రి బ్రహ్మోత్సవ వైభవాన్నిసంతరించుకుంది.ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ఫాల్గుణశుద్ధ ద్వాదశి వరకు 11 రోజులపాటు బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి ఘనమైన పురాణ ప్రశస్తి ఉంది.

రుష్యశృంగ మహర్షి పుత్రుడైన యాదర్షి తపోదీక్ష ఫలితంగా నృసింహుడు అర్చనామూర్తిగా యాదగిరిపై వెలశాడంటారు. బాల్యం నుంచి యాదుడువిష్ణుభక్తుడు.ప్రహ్లాదుడినుంచి స్ఫూర్తి పొంది,తానూ నరసింహుణ్ని దర్శించాలని సంకల్పించుకున్నాడు. అందుకోసం అడవి బాట పట్టాడు. కొండజాతివారికి మార్గమధ్యంలో చిక్కాడు. వారి బారి నుంచి రక్షించమని ఆంజనేయుణ్ని, యాదుడు ప్రార్థించాడు. ఆ బాలుడి మొర విని హనుమ అతణ్ని వారి చెర నుంచి విడిపించి, దిశానిర్దేశం చేశాడు. తరులు, జలసిరులు,ఫలపుష్పాదులతోశోభిల్లేఓగిరిపైహనుమ సూచన మేరకు యాదుడు తపస్సుకు ఉపక్రమించాడు. యాదుడి దీర్ఘకాల తపస్సు ఫలించింది. యాదర్షిగా నృసింహస్వామిని దర్శించాడు. యాదర్షి పేరిట ఈ కొండ యాదాద్రిగా ఖ్యాతిగాంచింది.ఎందరో చక్రవర్తులు, రాజులు యాదగిరీశుణ్ని కొలిచి తరించారు. కాకతీయ గణపతి దేవుడు,శ్రీకృష్ణదేవరాయలు స్వామిని దర్శించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. భక్తుల సౌకర్యంకోసం నిజాం ప్రభువులు కొండపైకి మార్గాన్ని నిర్మించారు.
యోగశాస్త్రరీత్యా పరిశీలిస్తే, మన శరీరంలో నాభిచక్రం జలస్థానం. దీనిపై సమున్నతంగా ఉండే గిరి వంటి ప్రదేశం మన శిరసు. ఈ శిరస్సులో సహస్రార చక్రం ఉంటుంది. ఈ సహస్రార కమలంలో నారాయణ పరబ్రహ్మాన్ని నెలకొల్పుకోవడమే యాదగిరిపై నెలకొన్న నృసింహుణ్ని దర్శించడం. శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడానికి భక్తులు దీక్షగా నలభై ఒక్క రోజులపాటు స్వామిని దర్శించి, పూజించి, గర్భాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసే సంప్రదాయం ఈ క్షేత్రంలో ఉంది.

 

     

   
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.